ఏపీ రైతులకు శుభవార్త చెప్పింది జగన్ సర్కార్. జూన్ 1వ తేదీన అంటే నేడు కర్నూలు జిల్లా పత్తికొండలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైయస్సార్ రైతు భరోసా సాయాన్ని సీఎం జగన్ రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత పెట్టుబడి సాయంగా 52.31 లక్షల మందికి రూ. 7,500 చొప్పున రూ. 3,934 కోట్లను బటన్ నొక్కి ఖాతాల్లో జమ చేస్తారు. అలాగే మార్చి, ఏప్రిల్, మే నెలలో కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు రూ. 46.39 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ అందించనున్నారు.
కాగా, ఇక ఇవాళ్టి నుంచి ఏపీలో భూముల ధరలు పెరగనున్నాయి. భూముల ధరలను పెంచే దిశగా ఏపీ ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసింది జగన్ సర్కార్.