ఎన్నికల విధుల్లో 2.5లక్షల ఉద్యోగులు : సీఈఓ వికాస్ రాజ్

-

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోసం ఈవీఎంల పరిశీలన పూర్తి అయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఈనెల 29న పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తామని వెల్లడించారు. ఈనెల 30న రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో హోం ఓటింగ్ పూర్తయిందని 1,68,000 ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఇచ్చామన్నారు. 26,660 హోం ఓటింగ్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు.ఎపిక్ కార్డ్స్ ప్రింటింగ్ పూర్తి అయిందని బిఎల్ఓ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామని చెప్పారు.

రాష్ట్రంలో 2290 అంది అభ్యర్థులు బరిలో ఉన్నారని.. 2.5 లక్షల ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉండనున్నారని వెల్లడించారు. 45 వేల మంది తెలంగాణ పోలీసులు, 23500 హోమ్ గార్డ్స్ ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారని వెల్లడించారు. 3000 మంది ఎక్సైజ్ పోలీసులు, 50వేల మంది టీఎస్పీఎస్సీ వాళ్ళు విధుల్లో ఉంటారని వెల్లడించారు. వీటితో పాటు కేంద్ర బలగాలు విధుల్లో ఉండనున్నట్లు చెప్పారు. ప్రతి పోలీస్ స్టేషన్లో వీల్ చైర్స్ అందుబాటులో ఉంటాయని.. బ్రెయిలీలో కూడా బ్యాలెట్ ప్రింటింగ్ చేశామన్నారు. 190 కేంద్రా కంపెనీల బలగాలు తెలంగాణలో విధులు విధుల్లో ఉండనున్నాయని తెలిపారు. 74 కంపెనీల కేంద్ర బలగాలు తెలంగాణకు రానున్నాయి. రాష్ట్రంలో ఎన్నికలకు 48 గంటల ముందు 144 సెక్షన్ ఉంటుందని.. ఎవ్వరూ కూడా డోర్ టు డోర్ ప్రచారం చేయకూడదని తెలిపారు. ఇతర నియోజకవర్గాల నుంచి ప్రచారానికి వచ్చిన వాళ్లు 28వ తేదీ సాయంత్రం వెళ్ళిపోవాలనీ సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news