రాహుల్ గాంధీ మీరు పెళ్లి చేసుకోండి.. ఒవైసీ సెటైర్లు..!

-

ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ మరోసారి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పై ఫైర్ అయ్యారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓవైసీ ప్రధాని నరేంద్ర మోడీకి స్నేహితుడని వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన ఓవైసీ.. రాహుల్ గాంధీ జీవితంలో రెండు ప్రేమలు ఉన్నాయని ఒకటి ఇటలీ అయితే మరొకరు ప్రధాన నరేంద్ర మోడీ అన్నారు. రెండు ప్రేమల్లో ఇటలీ ఉంది ఎందుకంటే అతని తల్లి అక్కడి నుంచే వచ్చారు రెండోది ప్రధాని మోడీ అని ఆయన రాహుల్ గాంధీకి అధికారం ఇస్తున్నాడని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మాట్లాడుతూ.. గాంధీ పై వ్యాఖ్యలు చేశారు.

2019లో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న అమేధీ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోవడానికి ప్రస్తావిస్తూ రాహుల్ పై విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోవాలని.. అతనికి ఇంట్లో ఎవ్వరు స్నేహితులు లేకపోవడంతోనే బయట తన స్నేహితుల గురించి ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు 50 ఏళ్లు నిండినందున ఇంట్లో ఎవరైనా ఒకరు ఉంటే అతనికి ప్రయోజనకరంగా ఉంటుందని ఓవైసీ సెటైర్లు వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news