తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొందరు మంత్రులు ఫైల్స్ క్లియరెన్స్ కోసం డబ్బులు తీసుకుంటారని బాంబు పేల్చారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ. నా దగ్గరకు కూడా ఓ కంపెనీ వాళ్లు ఫైల్ క్లియరెన్స్ కోసం వచ్చారన్నారు.

మీ ఒక్క రూపాయి కూడా నాకు వద్దు అని వాళ్లతో చెప్పానని పేర్కొన్నారు. బదులుగా ఆ డబ్బుతో సమాజ సేవ చేయమని వాళ్లకు సూచించాను అన్నారు మంత్రి కొండా సురేఖ. గతంలో కూడా కొండా సురేఖ అనేకసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. అక్కినేని మాజీ కోడలు హీరోయిన్ సమంత అలాగే గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య ఏదో జరిగిందని కూడా హాట్ కామెంట్స్ చేసి… రచ్చ లేపారు కొండా సురేఖ.
మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు!
కొందరు మంత్రులు ఫైల్స్ క్లియరెన్స్ కోసం డబ్బులు తీసుకుంటారు
నా దగ్గరకు కూడా ఓ కంపెనీ వాళ్లు ఫైల్ క్లియరెన్స్ కోసం వచ్చారు
మీ ఒక్క రూపాయి కూడా నాకు వద్దు అని వాళ్లతో చెప్పాను
బదులుగా ఆ డబ్బుతో సమాజ సేవ చేయమని వాళ్లకు సూచించాను
— BIG TV Breaking News (@bigtvtelugu) May 16, 2025