తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క కు నిరసన సెగ తగలింది. తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్కను నిలదీశారు ఏజెన్సీ వాసులు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని ఓడగూడెంలో పర్యటించిన మంత్రి సీతక్కను గ్రామవాసులు నిలదీశారు.

విస్తారంగా వర్షాలు పడ్డప్పుడు గ్రామంలో నీళ్ళు వచ్చి ఇండ్లు మునుగుతున్నాయని, ఇండ్లు మంజూరు చేయండని ప్రశ్నించారు. వర్షాలు పడినప్పుడు మేమొస్తాం మీరు అడుగుతారు.. ఎండాకాలంలో మీరు పడుకుంటారు, మేము పడుకుంటాం అని సీతక్క, గ్రామ వాసులకు సమాధానం ఇచ్చింది. అటు మంత్రి పొంగులేటికి నిరసన సెగ తగిలింది. నేలకొండపల్లిలో ఇందిరమ్మ ఇళ్లు ఎప్పుడు ఇస్తారు అంటూ నిలదీశారు ఓ మహిళ.