మాజీ మంత్రి కేటీఆర్ కు మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి కేటీఆర్ బంధువు కి చెందిన హోటల్ పై మెరుపు దాడి చేశారు తెలంగాణ రాష్ట్ర పోలీసులు. గచ్చిబౌలి లోని హోటల్ సెరాయ్ గ్రాండే లో తనిఖీలు చేశారు నార్కోటిక్ టీమ్స్, SOT పోలీసులు. గోడలు దూకి, ఎంట్రీ, ఎగ్జిట్ వే నుంచి ఒకేసారి హోటల్ లోపలికి వచ్చారు 35 మంది పోలీసులు.
రెండు గంటల పాటు తనిఖీలు చేశారు పోలీసులు. డ్రగ్స్ ఉన్నాయి అనే సమాచారం తో సోదాలు జరిపారు పోలీసులు. సోదాల్లో రాయదుర్గం, మాదాపూర్ పోలీసులు పాల్గొన్నారు. రూమ్స్ బుక్ చేసుకుని ఉన్న వాళ్ళను కూడా తనిఖీ చేసిన పోలీసులు..ఏమీ దొరకకపోవడంతో.. వెళ్లిపోయారని సమాచారం.