పండుగకు ఊర్లకు వెళ్తున్న వారు రైతుల కష్టాలను తెలుసుకోండి : హరీశ్ రావు

-

బోగ భాగ్యాలను తెచ్చే భోగీ, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు హరీశ్ రావు.  పండుగకు ఊర్లకు వెళ్తున్న వారు రైతుల కష్టాలను తెలుసుకోండి అని సూచించారు మాజీ మంత్రి హరీశ్ రావు. తాజాగా సంగారెడ్డిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ మోసాలపై గ్రామ గ్రామాన చర్చ జరగాలి. కౌలు రైతులకు మీరు ఇచ్చేది ఏది అని ప్రశ్నించారు.  ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భోగస్ అన్నారు. రైతును ఈ సర్కార్ ను దగా చేస్తోంది. రైతు భరోసాతో పేదలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు.

Harish Rao
Harish Rao

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద వారికి రావాల్సిన లబ్ది చేకూరాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా 15వేలు అన్నారు.. ఇప్పుడు 12 వేలు అంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క ప్రాజెక్టుకు పూర్తి కాలేదని భట్టి మాట్లాడటం ఆశ్చర్యకరం అన్నారు. 4వేల కోట్లు 6న్నర లక్షల ఎకరాల్లో ప్రతీ పంటకు నీరు వచ్చే విధంగా చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతల మాటలు కోటలు దాటుతున్నాయి. రైతు రుణమాఫీకి సంబంధించి 2,750 కోట్లు విడుదల చేశానని చెక్ ఇస్తే.. ఇవాల్టీ వరకు కూడా సంగారెడ్డికి మాత్రం చేరలేదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news