నల్లగొండ జిల్లా: తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములు, రోడ్లకు ఇరువైపులా ఉన్న భూములను ప్రభుత్వం ధరణిలో పెండింగ్ లో పెట్టిందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఈ సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ధరణి సమస్యలు నేను ఎత్తి చూపిస్తే.. సీఎం కేసిఆర్ తలకాయ లేని వాడిలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇంతకంటే మెరుగైన రెవెన్యూ వ్యవస్థ ఉందన్నారు.
హైదరాబాద్ చుట్టు పక్కల మేము పేదలకు పంచిన భూములను మీరు బహుళ కంపెనీలకు ఇచ్చారో లేదో కేటీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. కుర్చీ వేసుకుని కూర్చుని ప్రాజెక్టు పూర్తి చేస్తానన్న కేసిఆర్ కు కుర్చీ దొరకలేదా..? అని నిలదీశారు భట్టి. కాంగ్రెస్ వాళ్ళు ఉండబట్టే తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు. తొందరగా BRS పీడ వదిలించుకోవాలని సూచించారు. ధరణి అతి పెద్ద కుట్ర, ధరణి సాఫ్ట్ వేర్ ను మారుస్తాం, అప్పటి రికార్డులను పొందు పరుస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చింది దొరలకోసం కాదు.. ప్రజల కోసం అన్నారు భట్టి.