ఇవాళ దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే… దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. ఢిల్లీలో జరిగే పరేడ్ లో మొత్తం 25 శకటాలను ప్రదర్శించనున్నారు. మూడేళ్ల తర్వాత తొలిసారి రిపబ్లిక్ డే పరేడ్ లో తెలంగాణ శకటం ఉండనుంది.
డెమోక్రసి ఎట్ గ్రాస్ రూట్స్ పేరుతో తెలంగాణ శకటం కనిపించనుంది. తెలంగాణ శకటంపై చాకలి ఐలమ్మ, కొమురం భీం, రాంజీ గోండు విగ్రహాలు ఉంటాయి. డిజిటల్ క్లాసుల థీమ్ తో ఏపీ శకటం ఉంటుంది. ఏపీ విద్యావ్యవస్థలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన మార్పులపై శకటం ఉంటుంది. 16 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాల శకటాల ప్రదర్శన కూడా ఉంటుంది. గణతంత్ర వేడుకలకు ఢిల్లీలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.