సచివాలయంలో “తెలంగాణ తల్లి” విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే విగ్రహ విగ్రహావిష్కరణకు ముహూర్తం టైం 6.05 నిమిషాలు కాగా.. పూజా కార్యక్రమాలు నిర్వహించి “తెలంగాణ తల్లి” విగ్రహావిష్కరణ చేసారు సీఎం రేవంత్. అయితే తెలంగాణ తల్లి నూతన విగ్రహ ఆవిష్కరణపై BRS పార్టీ సభ్యులు ఆరోపణలు చేస్తున్నా.. తెలంగాణ తల్లులు ఎలా ఉంటారో తెలంగాణ తల్లి కూడా అలానే ఉంటుంది అని పేర్కొన కాంగ్రెస్ నేతలు తాజాగా విగ్రహావిష్కరణ చేసారు.
ఇక ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటుగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.