అలర్ట్.. తెలంగాణలో రానున్న మూడ్రోజులు వర్షాలు

-

ఇటీవల దాదాపు ఓ పది రోజుల పాటు గ్యాప్ లేకుండా కురుసిన వర్షాలు కాస్త గ్యాప్ తర్వాత గత రెండ్రోజుల క్రితం మళ్లీ కురిశాయి. మళ్లీ ఓ రెండ్రోజులు గ్యాప్ తీసుకుని ఆదివారం రోజున కుండపోత వర్షం కురిసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు పడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో 120.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

. రాష్ట్రంలో వచ్చే మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా హైదరాబాద్ వాసులు అప్రత్తమంగా ఉండాలని చెప్పారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో జీహెచ్ ఎంసీ అప్రమత్తమైంది. నగరంలో వర్షాల వల్ల నష్టం జరగకుండా రంగంలోకి దిగి ముందస్తు చర్యలు చేపడుతోంది.

మరోవైపు ఆదివారం రోజున కుమురం భీం జిల్లాలో 115 మిల్లీమీటర్ల మేరకు భారీ వర్షాలు కురిశాయి. కామారెడ్డి జిల్లాలో 64.5 మిల్లీమీటర్లు, రంగారెడ్డి జిల్లా పెద్దషాపూర్‌లో 42, నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లిలో 37.3, భూపాలపల్లి జిల్లా పెద్దంపేటలో 32.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. జీహెచ్‌ఎంసీ పరిధితోపాటు ఆదిలాబాద్‌ జిల్లా, నిర్మల్‌, మంచిర్యాల, కరీంనగర్‌, ములుగు, వరంగల్‌, నల్గొండ, మహబూబాబాద్‌, జగిత్యాల, వికారాబాద్‌ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి

Read more RELATED
Recommended to you

Latest news