తెలంగాణలో గత కొద్దిరోజులుగా భానుడి భగభగలు సెగలు పుట్టిస్తున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. రాష్ట్రంలో ఆదివారం నుంచి మంగళవారం వరకు ఉత్తర, దక్షిణ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 20 జిల్లాలకు పసుపు (ఎల్లో) రంగు హెచ్చరికలు జారీ చేశారు.
ఈనెల 3వ తేదీన కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించారు. ఉదయం వేళ పొగమంచు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపారు.