తెలంగాణలో మరో మూడ్రోజులు వర్షాలు

-

తెలంగాణపై గత కొద్దిరోజులుగా వరణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గ్యాప్ లేకుండా కురుస్తున్న వానతో రాష్ట్రంలోని రైతులు అతలాకుతలం అవుతున్నారు. రాష్ట్రంలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రకటించింది.

ఈ నెల 6న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నదని, దీని ప్రభావంతో 7న అదే ప్రాంతంలో ఆల్పపీడనం ఏర్పడవచ్చని తెలిపింది. ఆ తర్వాత ఇది తీవ్ర అల్పపీడనంగా కేంద్రీకృతమై ఈనెల 9 నాటికి తుఫానుగా బలపడవచ్చని చెప్పింది. ఈ తుపాను ఉత్తర దిశగా కదులుతూ బంగాళాఖాతం వైపు కదులుతూ తీవ్రతరం అయ్యే అవకాశాలున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు.

వాతావరణ కేంద్రం ప్రకటనతో రాష్ట్రంలోని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పంటంతా తడిచి నష్టాల్లో కూరుకుపోతుంటే.. దెబ్బ మీద దెబ్బ పడినట్లు ఈ వర్షాలు తమ జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నాయని వాపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version