‘నీ తండ్రి ఎవ్వరి బూట్లు నాకి వచ్చారో చెప్పు’.. కేటీఆర్ కి సీతక్క కౌంటర్..!

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిపై తప్పుడు కూతలు కూస్తున్న కేటీఆర్ మీరు ఎవరి పేరు పెట్టుకున్నారు? మీ తండ్రి కేసీఆర్ ఎవరి బూట్లు నాకి వచ్చారో చెప్పాలన్నారు. ‘తాను రేవంత్ రెడ్డిలాగా ఆంధ్రోళ్ల బూట్లి నాకి, సంచులు మోడి, పార్టీలు మారి రాజకీయాల్లోకి రాలేదని’ కేటీఆర్ నిన్న కామారెడ్డిలో వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ పై ఇవాళ కొత్తగూడెం జిల్లామణుగూరులో నిర్వహించిన కాంగ్రెస్ ప్రజాదీవెన సభలో మాట్లాడిన సీతక్క ఘాటుగా రియాక్ట్ అయ్యారు.


అధికారం ఆంధ్రవారి కాళ్ల వద్ద మీ మూతులు పెడతామన్నది మీరు కాదా అని విమర్శించారు. బీఆర్ఎస్ మాదిరిగా అవసరానికో మాట కాంగ్రెస్ పార్టీ మాట్లాడదన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని అధికారంలోకి వచ్చి.. అన్ని పదవులు వారి ఇంట్లోవారే తీసుకున్నారని ఓటిపోతే మళ్లీ దొడ్డిదారిలో వారే పదవుల్లోకి వచ్చారని మండిపడ్డారు. ఉద్యోగాలు అడిగిన నిరుద్యోగులను కేసులు పెట్టి జైల్లో పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version