దుబ్బాకలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య స్వల్ప ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసారు బీఆర్ఎస్ శ్రేణులు. అదే స్థానంలో దివంగత మాజీ మంత్రి ముత్యంరెడ్డి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేసేందుకు కాంగ్రెస్ అభిమానులు రావడం జరిగింది. ఈ తరుణంలోనే దుబ్బాకలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య స్వల్ప ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
అనంతరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దుబ్బాకలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య మధ్య ఘర్షణలను సముదాయించి పంపించారు పోలీసులు. దింతో దుబ్బాకలో వాతావరణం చల్లపడింది. ఇది ఇలా ఉండగా దుబ్బాక నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన సోలిపేట రామలింగారెడ్డి… కెసిఆర్ సర్కార్ రెండోసారి గెలిచిన సమయంలో… మరణించారు.