రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇవాళ ఉదయం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు ఒకేసారి నామినేషన్ దాఖలు చేశారు. రెండు పార్టీలకు సంబంధించి ర్యాలీ ఒకేసారి తీయడంతో.. రెండు పార్టీలు ఒకరినొకరు ఎదురుపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఒక పార్టీ నేతలపై మరో పార్టీ నేతలు దాడి చేయడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం తీవ్రతమైంది.
ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోవడంతో గొడవను అదుపు తీసుకొచ్చేందుకు లాఠీ ఛార్జీ చేశారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఈ తరుణంలో ఒకరిద్దరికీ తలకు గాయాలు అయినట్టు తెలుస్తోంది. రాళ్లు తగలడంతో తలకు, చేతికి స్వల్ప గాయాలయ్యాయి. పరస్పరం రాళ్లు రువ్వుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు. కొంత మంది ఇబ్రాహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇబ్రాహీంపట్నంలో ఉద్రిక్తత వాతావణం.!
-