BREAKING : హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయం ముట్టడి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే కాసేపటి క్రితమే.. వేల సంఖ్యంగా హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ముట్టించేందుకు ప్రయత్నం చేశారు.
వరద బాధితులను ఆదుకోవాలని.. హైదరాబాద్ లో ముంపు ప్రాంతాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. చేయాలని డిమాండ్ చేస్తూ.. హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ముట్టించేందుకు వచ్చారు. అయితే.. అక్కడే ఉన్న పోలీసులు… వారిని అరెస్ట్ చేస్తున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.