TGRTC : తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్.. యాజమాన్యానికి నోటీసులు

-

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నేతలు ఆర్టీసీ యజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, 2 పీఆర్సీల అమలు, సీసీఎస్, పీఎఫ్ డబ్బులు రూ.2700 కోట్లు చెల్లింపు డిమాండ్లను యాజమాన్యం ముందు ఉంచారు. డిమాండ్లను నెరవేర్చకపోతే సమ్మెకు దిగుతామని నోటీసుల్లో పేర్కొన్నారు. పెద్ద ఎత్తున కార్మిక సంఘాల నేతలు బస్ భవన్ వద్దకు చేరుకోవడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.

21 డిమాండ్లతో సమ్మె నోటీసులు యాజమాన్యానికి అందించారు ఆర్టీసీ యూనియన్ నేతలు.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి 14 నెలలు అయినా ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని, మేనిఫెస్టోలో చెప్పినట్లుగా తమ సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికుల డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news