మీర్ పేట హత్య కేసును ఛేదించిన పోలీసులు

-

ఎట్టకేలకు మీర్ పేట హత్య కేసును పోలీసులు ఛేదించారు. వెంకట మాధవిని భర్త గురుమూర్తి హత్య చేశాడని నిర్థారించారు. గత రెండు, మూడు రోజులుగా మాధవి హత్య కేసును ఛేదించలేకపోయారు పోలీసులు. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కేసును ఛేదించేందుకు కొంచెం కష్టం అయింది. బ్లూ టీమ్, డీఎన్ఏ రిపోర్ట్ ఆధారంగా నిర్దారించారు పోలీసులు.

సంక్రాంతి పండుగ రోజు ఈనెల 14న వెంకటమాధవి, గురుమూర్తి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి వెళ్లి వచ్చారు. ఆ తరువాత వీరిద్దరి మధ్య వివాదం తలెత్తడంతో గురుమూర్తి దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె స్పృహ కోల్పోయింది. దీంతో గురుమూర్తి ఊపిరి ఆడకుండా చేసి చంపాడు.. శరీరాన్ని నాలుగు ముక్కలు చేశాడు. వాటర్ హీటర్ తో వేడి చేసి కాళ్లు, చేతుల భాగానికి సంబంధించిన ముక్కలను అందులో వేశాడు. సూక్ష్మదర్శని సినిమా ప్రేరణతో ఆనవాల్లు లేకుండా చేశాడు. కాలిపోయిన ఎముకలను ఇనుప రాడ్డుతో పొడి చేశాడు. ఆ పొడిని చెరువులో పడేశాడు. దీంతో ఆధారాలు లభ్యం కాలేదు.  మృతదేహాన్ని కాల్చే సమయంలో గురుమూర్తికి పలు చోట్ల గాయాలు అయ్యాయి. తాజాగా పోలీసులు మీడియాకు వివరాలను వెల్లడించారు. 

Read more RELATED
Recommended to you

Latest news