RTCకి ఫ్రీ బస్సు స్కీమ్ డబ్బులు…కాంగ్రెస్ ఒక్క రూపాయి ఇవ్వలేదు – వర్కర్స్ ఫెడరేషన్

-

కాంగ్రెస్ ప్రభుత్వం టీజీఎస్ఆర్టీసీకి ఫ్రీ బస్సు స్కీమ్ డబ్బులు ఒక్క రూపాయి ఇవ్వలేదని సంచలన వ్యాఖ్యలు చేసారూ టీజీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీ. శ్రీనివాస్ రావు. తాజాగా మీడియాతో టీజీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీ. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ… ఫ్రీ బస్సు వల్ల ఆర్టీసీకి 6 నెలల్లో రూ. 2,500 నష్టం వాటిల్లిందన్నారు.

TGSRTC Staff and Workers Federation Telangana State General Secretary V. Srinivas Rao

ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి దాదాపు రూ. 2,500 కోట్ల నిధులను తక్షణం సంస్థకు చెల్లించాలని టీజీఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(ఎస్ఈబ్ల్యూఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీ. శ్రీనివాస్ రావు ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్లోని సుందరయ్య కళానిలయంలో ఫెడరేషన్ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో సంస్థకు ఆరు నెలలుగా రోజుకు సుమారు రూ.15 కోట్ల చొప్పున నష్టం వాటిల్లుతోందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version