టీజీటీ మెరిట్‌ జాబితా వెల్లడి.. ఈ నెల 27, 28వ తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన

-

తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో 4,006 ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ) పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో మెరిట్‌ జాబితాలను గురుకుల నియామక బోర్డు ప్రకటించింది. ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ఈ జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలోని అభ్యర్థులకు 27, 28 తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేపట్టనున్నట్లు బోర్డు తెలిపింది.

సబ్జెక్టుల వారీగా మెరిట్‌ జాబితాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు, ధ్రువీకరణ పత్రాల పరిశీలన షెడ్యూల్‌ను వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు వెల్లడించింది. అభ్యర్థులకు బంజారాహిల్స్‌లోని బంజారాభవన్‌, ఆదివాసీ కుమురంభీం భవన్‌, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన కొనసాగనున్నట్లు తెలిపింది. పత్రాల పరిశీలన తరువాత రెండు రోజుల్లో తుది ఎంపిక జాబితాలు ప్రకటించనున్నట్లు పేర్కొంది.

టీజీటీ ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఇలా…

27న బంజారాభవన్‌లో ఇంగ్లిష్‌ సబ్జెక్టుకు, ఆదివాసీ భవన్‌లో ఉదయం బయోసైన్స్‌, మధ్యాహ్నం జనరల్‌ సైన్స్‌కు, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఉదయం సోషల్‌ స్టడీస్‌, మధ్యాహ్నం తెలుగు సబ్జెక్టు

28న బంజారాభవన్‌లో గణితం సబ్జెక్టుకు, ఆదివాసీ భవన్‌లో ఫిజికల్‌ సైన్స్‌ సబ్జెక్టుకు, పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఉదయం హిందీ, మధ్యాహ్నం హిందీ, ఉర్దూ, సంస్కృతం సబ్జెక్టులకు పరిశీలన ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news