వచ్చే నెల 4న తెలంగాణలో అమిత్‌షా పర్యటన

-

కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌ షా.. తెలంగాణ టూర్‌ ఫిక్స్‌ అయింది. వచ్చే నెల 4న తెలంగాణలో అమిత్‌ షా పర్యటించనున్నారు. విజయ సంకల్ప యాత్ర ముగింపు సభలో పాల్గొననున్నారు అమిత్‌ షా. ఐదు పార్లమెంట్‌ క్లస్టర్లలో పూర్తి చేసుకుని హైదరాబాద్‌ కు రానున్నాయి యాత్రలు. హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభతో యాత్రలను ముగించాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు అమిత్‌షా.

కాగా, బిజెపి తెలంగాణలో త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకి పోటీ చేసే ఆరుగురు అభ్యర్థుల పేర్లు ఖరారు చేసింది.సికింద్రాబాద్‌ నుంచి కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, కరీంనగర్‌ నుంచి బండి సంజయ్‌ కుమార్ ,నిజామాబాద్‌ – ధర్మపురి అర్వింద్,చేవెళ్ల – కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి,భువనగిరి – బూర నర్సయ్య గౌడ్,ఖమ్మం – డాక్టర్‌ వెంకటేశ్వరరావు పేర్లను ఖరారు చేసింది.మరోవైపు తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసేందుకే బీజేపీ మొగ్గుచూపింది. బీఆర్ఎస్‌తో పొత్తు ఉందంటూ జరుగుతున్న ప్రచారానికి ఇప్పటికే పార్టీలోని పలు కీలక నేతలు క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news