ఇటీవల తెలంగాణా ప్రభుత్వం శాసన సభలో ప్రవేశ పెట్టిన 12 బిల్లులు కూడా చట్ట రూపం దాల్చాయి. గవర్నర్ ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసారు. అమల్లోకి వచ్చిన భూమిహక్కులు – పట్టాదారు పాసుపుస్తకాలు, వీఆర్ఓ పోస్టుల రద్దు, టీఎస్ బీపాస్ చట్టాలు అమలులోకి వచ్చాయి. అదే విధంగా ధరణి పోర్టల్ ని కూడా ఆమోదించారు. ఇక నుంచి అన్ని రిజిస్ట్రేషన్లు కూడా అందులోనే జరుగుతాయి.
అమల్లోకి పురపాలక, పంచాయతీరాజ్, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల, జీఎస్టీ సవరణ చట్టాలు వచ్చాయి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది న్యాయ శాఖ. కాసేపట్లో సిఎం కేసీఆర్ ధరణి పోర్టల్ పై సమావేశం నిర్వహిస్తారు. అధికారులకు పలు సూచనలు చేస్తారు ఆయన. మొత్తం 12 బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించడంతో కేసీఆర్ హర్షం వ్యక్తం చేసారు.