ప్రజల సంపద పెంచడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క తెలిపారు. బోథ్ మండల కేంద్రంలోని పరిచయ గార్డెన్ లో బోథ్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం లో ముఖ్యఅతిథిగా మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు, బోథ్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ ఆడే గజేంద్ర పాల్గొన్నారు.
అనంతరం బోథ్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేంద్ర మాట్లాడుతూ కాంగ్రెస్ కోసం ఎనలేని సేవ చేసిన కార్యకర్త బొడ్డు గంగారెడ్డి అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకి న్యాయం జరుగుతుంది అని తెలిపారు. గంగారెడ్డి పార్టీ మీటింగ్ కూడా తన సొంత ఖర్చులతో హాజరు అయ్యే కార్యకర్త అని అందుకే పదవి ఇప్పించే బాధ్యత నేనే తీసుకున్న అని తెలిపారు. ఇలా కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించేది కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు.