రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసు రేపు సుప్రీంకోర్టు లో విచారణకు రానుంది. బీఆర్ఎస్ పార్టీ బీ ఫారం మీద గెలిచి.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి మారిన 10 మంది ఎమ్మెల్యేలపై హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు ఆ పార్టీకి చెందిన నాయకులు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే నిర్ణయం స్పీకర్ కు వదలడంతో.. తెలంగాణ
స్పీకర్ చర్యలు తీసుకోలేదని సుప్రీంను ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ. కాగా గత విచారణ సందర్భంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత నిర్ణయం తీసుకోడానికి ఇంకా ఎంత సమయం కావాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ధర్మాసనం.
ఎంత సమయం పడుతుందో చెప్పకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని సుప్రీం తెలపగా.. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పిన స్పీకర్ తరపు న్యాయవాది సమాధానం తెలియజేశారు. సరైన సమయం అంటే ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసే సమయమా అని తీవ్ర స్వరంతో ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో రేపటి విచారణ కీలకంగా మారగా.. పార్టీ మారిన ఎమ్మెల్యేల భవితవ్యం రేపు డిసైడ్ కానుంది. మరీ ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.