ఆధార్ లో తెలంగాణ లేదని మహిళకు టికెట్ ఇచ్చిన కండక్టర్..!

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలందరికీ ఎక్స్ ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల పురుషులకు సీట్లు దొరక్క ఇబ్బంది పడటం ఒక ఎత్తయితే.. మరోవైపు ఆధార్ కార్డు అప్ డేట్ చేయించుకోవడం మరో ఎత్తు. ఆధార్ కార్డులో తెలంగాణ అని లేదని ఫ్రీ టికెట్ ఇచ్చేది లేదంటూ మహిళను తిట్టింది కండక్టర్.

ఈరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కూకట్‌పల్లి 4 ఫేజ్‌లో ఓ మహిళ AP11Z6960 బస్ ఎక్కి ఆధార్ కార్డు చూపించింది. అందులో అడ్రస్ మందమర్రి, అదిలాబాద్ జిల్లా ఆంధ్ర ప్రదేశ్ అని ఉండగా తెలంగాణ అని లేదని ఫ్రీ టికెట్ ఇవ్వను అంటూ కండక్టర్ ఆ యువతిని తిట్టాడు. ఆ మహిళ ఎంత వారించినా వినకుండా టికెట్ కొనాల్సిందే.  లేదంటే బస్సు నుంచి దిగిపోవాలంటూ వారించింది కండక్టర్. చివరికి రూ. 30 చెల్లించి టికెట్ తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version