ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం.. 84 లక్షలు వసూలు చేసిన కిలాడీ లేడీలు

-

ఉద్యోగాల పేరుతో రూ.84 లక్షలు వసూళ్లు బాబోయి.. కలెక్టర్ సంతకం కూడా ఫోర్జరీ చేసారు. సంగారెడ్డి జిల్లాలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల పేరుతో భారీ మోసం చేశారు. అంగట్లో సరుకుల్లా నర్స్ పోస్టులు అమ్మకానికి పెట్టారు కిలాడి లేడీలు అనురాధ, మరియమ్మ. ఇది నిజమే అని నమ్మి తాళి పూస్తేలు కుదువపెట్టి, అప్పు చేసి కట్టిన ఒక్కొక్కరు 3 లక్షల రూపాయలు కట్టారు బాధితులు. సంగారెడ్డి, జహీరాబాద్, బోధన్ కి చెందిన 28 మంది నుంచి 84 లక్షల రూపాయలు వసూళ్లు చేయడమే కాకుండా సంగారెడ్డి కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి కలెక్టరేట్ లోనే నకిలీ అపాయింట్ మెంట్ ఇచ్చారు కిలాడి మహిళలు.

డ్యూటీ కోసం సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి వెళ్లగా బయటపడింది అసలు విషయం. తమ డబ్బులు తమకు ఇవ్వాలని బాధితులు నిలదీస్తే బెదిరింపులకు పాల్పడుతుంది ఈ ముఠా. ఇంట్లో చెప్పలేక, జాబ్ కోసం చేసిన అప్పు తీర్చలేక ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నారు కొందరు బాధితులు. ఈ ఘటన వెనుక అసలు సూత్రధారులు వేరే వాళ్ళు ఉన్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు బాధితులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version