తెలంగాణ మహిళా కొండా సురేఖకు ఊహించని షాక్ తగిలింది. తాజాగా మంత్రి కొండా సురేఖపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ మహిళా కొండా సురేఖపై వరంగల్ కాంగ్రెస్ నేతల తిరుగుబాటు చేయడం జరిగిందట.
మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీకి వరంగల్ పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కొండా వర్గీయులు అన్ని విషయాల్లో ఇబ్బందులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై బుధవారం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ను కలవనున్నారట వరంగల్ కాంగ్రెస్ నేతలు. మరి దీనిపై తెలంగాణ మహిళా కొండా సురేఖ ఎలా స్పందిస్తారో చూడాలి.