తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను జైలుకు పంపించండి.. ఆలస్యం చేయకండి అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రవీంద్ర నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ చేసిన అవినీతి పై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ను జైలుకు పంపించే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి డీలే చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
మాజీ సీఎం అవినీతి పై కాగ్ లాంటి నిఘా సంస్థలతో పాటు ప్రధాని మోడీ కూడా ఆరోపణలు చేశారని ఆయన పేర్కొన్నారు. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ఆయన పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆయన పై చర్యలు తీసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. పదేళ్లలో తెలంగాణలో ఆర్థిక విధ్వంసం జరిగిందని.. ఆరోపించారు. రాష్ట్రాన్ని రూ.7లక్షల కోట్ల అప్పుల ఊబిలో ముంచారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం అవినీతిపై చర్యలు తీసుకొని ఆ సంపాదనకు రీకవరి చేయాలని.. తెలంగాణ అభివృద్ధికి ఉపయోగించాలని రవీంద్ర నాయక్ సీఎం ను కోరారు.