తెలంగాణ అమరవీరులను అవమానపరిచే సంస్కృతి తమది కాదని.. పూజించే సంస్కృతి అని అన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. నేడు అబిడ్స్ లోని తెలంగాణ సారస్వత పరిషత్ లో భారత జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ సాహిత్య సభలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రలో నేడు సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు అని ఆమె అన్నారు. నేడు కొన్ని పత్రికలు సమైక్య రాష్ట్రంలో అవలంబించిన విధానాలనే నేడు కూడా అవలంబిస్తున్నాయని మండిపడ్డారు.
ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్న పత్రికల మనసు మారాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కొన్ని పత్రికలు ఇక్కడ జ్యోతులు కావు అని విమర్శించారు ఎమ్మెల్సీ కవిత. ప్రతి క్షణం, ప్రతిరోజు విషం చిమ్ముతూనే ఉన్నాయని దుయ్యబట్టారు. ఇక తెలంగాణ సాహిత్యం మీద గంభీరమైన చర్చ జరగాలన్న ఉద్దేశంతోనే తెలంగాణ సాహిత్య సభలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.