BREAKING : ముసరాంబాగ్ బ్రిడ్జి వద్ద కొట్టుకు మహిళా మృతదేహం వచ్చింది. ముసరాంబాగ్ బ్రిడ్జి చెత్త తొలగిస్తుండగా గుర్తుతెలియని మహిళా మృతదేహం కొట్టుకు వచ్చింది. నాలుగు రోజుల క్రితం హుస్సేన్ సాగర్ నాలాలో గల్లంతయిన లక్ష్మి గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. మహిళ మృతదేహం వరద నీటి నుంచి బయటకు తీస్తే మరిని వివరాలు తెలిసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

కాగా, మూసరంబాగ్ బ్రిడ్జి రాకపోకలు అనుమతించారు ట్రాఫిక్ పోలీసులు. మూసీ వరద నీటితో మూసరంబాగ్ బ్రిడ్జి లో పేరుకుపోయిన చెత్త తొలగిస్తున్నారు జిహెచ్ఎంసి కార్మికులు. నిన్న రాత్రి 9:00 నుంచి ఉదయం 8 వరకు ముసారాంబాగ్ బ్రిడ్జ్ క్లోజ్ చేసిన ట్రాఫిక్ పోలీసులు…ఇవాళ రీ – ఓపెన్ చేశారు. దీంతో ముసరాంబాగ్ బ్రిడ్జిపై యధావిధిగా వాహనాలు అనుమతిస్తున్నారు పోలీసులు. ముసారాంబాగ్ బ్రిడ్జ్ ఎడ్జ్ తాకుతూ ప్రవహిస్తోంది మూసి వరద. ఉస్మాన్ సాగర్ ఆరు గేట్లు, హిమాయత్ సాగర్ 6 గేట్లు ఓపెన్ చేసి మొత్తం 6,000 క్యూసెక్కుల వరద మూసీ లోకి విడుదల చేశారు.