కాంగ్రెస్ పార్టీ తుది జాబితా విడుదల… అద్దంకి, నీలo మధుకు మొండి చేయి!

-

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తరుణంలో కాంగ్రెస్ పార్టీ తుది జాబితా విడుదల చేసింది. మొత్తం ఐదుగురి పేర్లతో ఫైనల్‌ లిస్ట్‌ రిలీజ్‌ చేసింది కాంగ్రెస్‌ పార్టీ. పటాన్‌చెరులో నీలం మధు స్థానంలో కట్ట శ్రీనివాస్ గౌడ్‌కు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ. ఇక అటు తుంగతుర్తిలో మందుల సామియెల్, సూర్యాపేటలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి, మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి, చార్మినార్ లో ముజీబ్ షరీఫ్ పేర్లను ప్రకటించింది కాంగ్రెస్‌ పార్టీ.

congress

అయితే…నీలం మధు, అద్దంకి దయాకర్ ఇద్దరినీ నమ్మించి గొంతు కోసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈ ఇద్దరి అడుగులు ఎటు వైపు ఉంటాయో చూడాలి. ఇక అటు పటాన్ చేరు కాంగ్రెస్ టికెట్ మార్పుపై ఓ వైపు సంబరాలు, మరో వైపు నిరసనలు జరుగుతున్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచి నీలం మధు అనుచరుల ఆందోళన కొనసాగుతోంది. కాట శ్రీనివాస్ కు టికెట్ కేటాయించడంతో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు ఆయన వర్గీయులు. అటు నీలం మధు టికెట్ ఇవ్వకపోవడంతో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ దిష్టి బొమ్మల దగ్ధం చేశారు. నీలం మధు ఇంటికి భారీగా చేరుకున్న అనుచరులు… భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news