కేసీఆర్‌ నామినేషన్‌ అఫిడవిట్లో కీలక వివరాలు

-

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) గురువారం నామినేషన్ వేశారు. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు కామారెడ్డి నుంచి కూడా ఈసారి కేసీఆర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం ఈ రెండు స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్బంగా కేసీఆర్ సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

కేసీఆర్ ఆస్తులు, అప్పులు ఎంతో తెలుసా? | telangana CM KCR assets details in  nomination - Telugu Oneindia

కేసీఆర్ పేరు మీద ఒక్క బైక్, కారు లేదని హార్వెస్టర్లు, ట్రాక్టర్లు, జేసీబీతో పాటూ ఇతర వాహనాలు ఉన్నాయి. వీటి మొత్తం సంఖ్య 14గా పేర్కొన్నారు. వీటి విలువ రూ. 1.16 కోట్లుగా పొందుపరిచారు. ఇక బంగారం విషయానికి వస్తే.. 2.8 కేజీల బంగారం ఉన్నట్లు వాటి విలువ రూ. 17లక్షలుగా వెల్లడించారు. తనతోపాటూ తన భార్యకు ఒక సెంటు భూమి కూడా సొంతంగా లేదన్నారు. అందరికీ కలిపి ఉమ్మడి ఆస్తిగా 62 ఎకరాల భూమిని చూపించారు.

ప్రస్తుతం తన వద్ద రూ. 2లక్షల 96వేల రూపాలయలు నగదు ఉన్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ సతీమణి శోభమ్మ పేరు మీద రూ. 17కోట్లకు పైగా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లు చూపించారు. 2018లో చూపించిన దానితో పోల్చితే దాదాపు రెండింతలు ఆదాయం పెరిగినట్లు తెలుస్తోంది. గతంలో సేవింగ్స్, ఎఫ్డీలు కలిపి రూ. 5.63 కోట్లు కాగా ఇప్పుడు రూ. 11.16కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 2018లో శోభమ్మ చేతిలో ఉన్న నగదు రూ. 94వేలు కాగా ఇప్పుడు రూ. 6.29 కోట్లు ఉన్నట్లు ప్రకటించారు. కేసీఆర్‌కు రూ. 17.83 కోట్లు స్థిరాస్తులు ఉండగా.. చరాస్తులు రూ. 9.67 కోట్లు ఉన్నట్లు చూపించారు. శోభమ్మ పేరు మీద రూ. 7.78 కోట్ల చరాస్తులు ఉన్నాయి. ఇద్దరికీ కలిపి ఉమ్మడి ఆస్తి కింద రూ. 9.81 కోట్ల చరాస్తులు ఉన్నాయి. ఇక అప్పు విషయానికొస్తే.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రూ. 17.27 కోట్లు అప్పు ఉందని చూపించారు. కుటుంబానికి సంబంధించి రూ. 7.23 కోట్లు అప్పు ఉన్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news