- ఆగస్ట్ 1 నుండి తెలంగాణలో పెరగనున్న లాండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు
- తెలంగాణలో భూములు, స్థిరాస్తుల విలువ పెంచనున్న ప్రభుత్వం.. తద్వారా పెరగున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు
తెలంగాణలో ఆగస్టు 1 నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ కు కొత్త చార్జీలు అమలు కానున్నాయి. భూముల మార్కెట్ విలువ సవరణపై స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది.
జూలై 1న కొత్త చార్జీలను నిర్ధారించనుంది. సలహాలు, అభ్యంతరాల పరిశీలన పూర్తయ్యాక తుది మార్కెట్ విలువను ఖరారు చేయనుంది. ఆయా ప్రాంతాల్లో స్థలాల వాస్తవిక ధరలను బట్టి మార్కెట్ విలువను నిర్ణయించనుంది.