తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 3,79,751 అటూ డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం… తెలంగాణ తలసరి ఆదాయం 3,79,751 కాగా వృద్ధిరేటు 9.6 శాతంగా ఉందని తెలిపారు డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క. దేశ తలసరి ఆదాయం 2,55,079 కాగ వృద్దిరేటు 8.8 శాతంగా ఉందని వివరించారు.
25.35 లక్షల రైతులకు రూ. 20,616 కోట్లు రుణ మాఫీ చేసిన్నట్లు ప్రకటించారు. మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొనసాగుతుందని..43 లక్షల కుటుంబాలకు గ్యాస్ సబ్సిడీకి రూ. 433 కోట్ల ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. గృహజ్యోతి పథకంలో 50 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు వెల్లడించారు. 4.5 లక్షల ఇండ్ల నిర్మాణానికి ఇందిరమ్మ ఇండ్లు పథక ప్రారంభం చేసినట్లు వెల్లడించారు. ఆరోగ్యశ్రీ పరిధిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. వడ వరి కొనుగోలుకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇస్తున్నట్లు చెప్పారు డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క.