మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కి పొంచి ఉన్న ముప్పు!

-

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెను ప్రమాదం జరిగే ఛాన్స్‌ కనిపిస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ (మం) మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కి ముప్పు పొంచి ఉంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ అంతర్రాష్ట్ర వంతెన..ఒక్కసారిగా కుంగిపోయింది. బీ బ్లాక్ లోని 18,19, 20, 21 పిల్లర్స్ వద్ద వంతెన కుంగడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.

The pillars of Medigadda Lakshmi Barrage have collapsed
The pillars of Medigadda Lakshmi Barrage have collapsed

దీంతో లక్ష్మీ బ్యారేజ్ వద్ద రాకపోకలు నిలిపివేసి సైరన్ వేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. బ్యారేజ్ వంతెన వద్ద ఇరువైపులా మట్టి కుప్పలు పోసి, భద్రత చర్యలు చేపట్టారు పోలీసు అధికారులు. లక్ష్మీ బ్యారే జ్ లో 85 గేట్లు ఎత్తి ,దిగువకు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు. ఈ తరుణంలోనే.. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా… ఈ మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ అంత ర్రాష్ట్ర వంతెనను రూ. 4000 కోట్లతో ఏర్పాటు చేశారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version