గత ప్రభుత్వం ఉద్యోగాల కల్పన పై దృష్టి పెట్టలేదు : సీఎం రేవంత్ రెడ్డి

-

గత ప్రభుత్వం ఉద్యోగాల కల్పన పై దృష్టి పెట్టలేదు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ ఎల్బీ స్టేడియంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామక పత్రాలను అందజేసే సందర్భంగా సభలో మాట్లాడారు. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం.. ప్రజల సమస్యలను పరిస్కరిస్తుంది. కేసీఆర్ తన బంధువులకు అనేక పదవులు కట్టబెట్టారు. కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. కేసీఆర్ ఆడే డ్రామాలను అందరూ చూశారు.

అసెంబ్లీలో జరిగే చర్చకు రమ్మంటే రారు.. కానీ నల్గొండలో జరిగే సభకు మాత్రం వెళ్తారని పేర్కొన్నారు. చంపుతారా.. చంపండి అని కేసీఆర్ అంటున్నారు. ఆయన చచ్చిన పాము.. చచ్చిన పామును ఎవ్వరైనా చంపుతారా అని సెటైర్లు వేశారు రేవంత్ రెడ్డి. పదేళ్లు అధికారంలో ఉంటా.. ప్రజలు ఆమోదిస్తే.. మరో పదేళ్లు ఉంటానని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. రాబోయే రోజుల్లో 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత మాది అన్నారు. అసెంబ్లీకి రాని వారికి అధికారం ఎందుకు..? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news