సామాన్యులకు మరో బిగ్ షాక్ తగిలింది. కొండెక్కింది కోడిగుడ్డు ధర. ఆల్‌టైం హై రికార్డు నమోదు చేసింది కోడిగుడ్డు ధర. కార్తీక మాసం ముగియడం, చలికాలం కావడంతో కోడిగుడ్ల ధరలు పెరిగిపోతున్నాయి. ఇవాళ విశాఖ మార్కెట్ లో 100 గుడ్ల ధర రూ. 580, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రూ. 584గా నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ ఖరారు చేసింది.
ఈ రేటు ఆల్ టైం రికార్డు అని అధికారులు చెబుతున్నారు. రిటైల్ లో ఒక్కో గుడ్డును రూ. 6.50-7 కు వ్యాపారులు విక్రయిస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ దాదాపుగా ఇదే రేటు ఉంది. అటు . రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు మరింత తగ్గాయి. రెండు నెలల కిందట విత్ స్కిన్ కేజీ రూ. 240, స్కిన్ లెస్ రూ. 260 వరకు పలకగా…. ఇప్పుడు దాదాపు రూ.100 తగ్గింది.ప్రస్తుతం కేజీ విత్ స్కిన్ రూ. 120, స్కిన్ లెస్ రూ. 140గా ఉంది. కొన్నిచోట్ల రూ. 100కే కేజీ చికెన్ విక్రయిస్తున్నారు. అయితే కార్తీకమాసం ముగుస్తుండటంతో రేట్లు మళ్లీ పెరిగే అవకాశం ఉందని పౌల్ట్రీ వ్యాపారులు అంటున్నారు.