భద్రాచలం వద్ద స్వల్పంగా గోదావరి వరద తగ్గుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 55.70 అడుగులు ఉంది గోదావరి. అయినప్పటికీ..భద్రాచలం వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువ నుంచి కొంతమేరకు స్వల్పంగా తగ్గింది వరద. ఇక అటు మూడు రోజుల నుంచి భద్రాచలం – చత్తీస్ గడ్ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.
భద్రాచలం నుంచి వాజేడు కూడా రాకపోకలు బంద్ అయ్యాయి. జాతీయ రహదారిపై వరద నీరు ఇంకా అలాగే ఉంది. పలు గ్రామాల్లో చుట్టూ వరద నీరు రాకపోకలు బంద్ అయ్యాయి. ఇప్పటికే పది వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. అటు కాంగ్రెస్ ,ఇటు అధికార పార్టీ బిఆర్ఎస్ నేతలు వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటనలు చేస్తున్నారు. వరద ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని చెపుతున్నారు అధికార పార్టీ నేతలు.