కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. తక్కువ ధరకే సిమెంటు !

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం… కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొత్తగా ఇల్లు కట్టుకునే తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పేందుకు రంగం సిద్ధం చేసింది. తక్కువ ధరకే సిమెంట్ అలాగే స్టీల్ ఇప్పించేందుకు రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మాత్రమే ఈ సబ్సిడీ వర్తించేలా… చర్యలు తీసుకుంటుంది రేవంత్ రెడ్డి.

indhiramma

నాలుగు విడతలలో ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు… తక్కువ ధరకే సిమెంటు అదే సమయంలో స్టీల్ అందించాలని రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు వెళ్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో సిమెంటు బస్తా ధర 260 రూపాయలు ఉన్న సంగతి తెలిసిందే.

అలాగే టన్ను స్టీలు 54,000 వరకు ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ రెండు కంపెనీలతో మాట్లాడి… ఇందిరమ్మ లబ్ధిదారులకు తక్కువ ధరకే… సిమెంట్ అలాగే స్టీల్ ఇప్పించే ప్రయత్నం చేస్తుందట. అటు ఇసుక కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న నేపథ్యంలో… ఉచితంగా ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news