ఏపీ పెన్షన్ దారులకు శుభవార్త అందించింది చంద్రబాబు నాయుడు సర్కార్. రెండు రోజుల ముందుగానే పెన్షన్ దారులకు డబ్బులు జమ చేయనుంది. ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్ దారులకు డబ్బులు జమ చేస్తున్నారు. అయితే… వచ్చే నెలలో తేదీ మార్చారు. జనవరి 1 వ తేదీ ఇచ్చే ఫించను ఈ నెల 31వ తేదీకి మార్పు చేశారు.
ఈ నెల 30 వ తేదీ న బ్యాంక్ లో డబ్బులు జమ చేయనుంది చంద్రబాబు నాయుడు సర్కార్. ఈ తరుణంలోనే ఫించన్లు పంపిణీకి చర్యలు చేపడుతున్నారు అధికారులు. అయితే…దీనిపై అధికారిక ప్రకటన అయితే రాలేదు.. కానీ ప్రచారం జరుగుతోంది. కాగా, ఇవాళ ఉదయం హైదరాబాద్ కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రానున్నారు. శంషాబాద్ లో మంత్రి టీజీ భరత్ కుమార్తె వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించునున్నారు సీఎం చంద్రబాబు. ఇవాళ హైదరాబాదులోనే ఉండనున్నారు సీఎం చంద్రబాబు.