తెలంగాణ ప్రజలు మరోసారి సిఎం కేసీఆర్ వైపే ఉన్నారని టైమ్స్ నౌ సర్వే చెప్పింది. తెలంగాణలో కేసీఆర్ సర్కారుకు తిరుగులేదని.. కాంగ్రెస్, బీజేపీలు దరిదాపుల్లో సైతం లేవని తేల్చి చెప్పింది ప్రముఖ నేషనల్ ఛానల్ టైమ్స్ నౌ. తెలంగాణలో కేసీఆర్ హవా ఏ మాత్రం తగ్గలేదని.. లోక్ సభ ఎన్నికల్లో గతంలో కంటే మరో రెండు స్థానాలు ఎక్కువ సాధించే అవకాశం ఉందని చెప్పింది టైమ్స్ నౌ సర్వే.
అంటే లోక్ సభ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి 9 నుంచి 11 సీట్లు వస్తాయని తేల్చి చెప్పింది ప్రముఖ నేషనల్ ఛానల్ టైమ్స్ నౌ. కాగా, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ఈనెల 5తో ముగియనుంది. ఆ తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 2018లో అక్టోబర్ 6న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగా… డిసెంబర్ 7న పోలింగ్ నిర్వహించి, 11న ఫలితాలు ప్రకటించారు. దీంతో 2023 ఎన్నికల షెడ్యూల్ ను ఈ నెల 6 నుంచి 12వ తేదీ మధ్య ఏ రోజైనా ప్రకటించవచ్చనే ప్రచారం జరుగుతోంది.