చీరకట్టులో చిరునవ్వుతో మాయచేస్తున్న రాశీ ఖన్నా

-

టాలీవుడ్ రావిషింగ్ బ్యూటీ రాశిఖన్నా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్​గా ఉంటుంది. ఈ భామ తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఇక తన ఫొటోషూట్స్​తో ఎప్పటికప్పుడు ఫొటోలు పోస్ట్ చేస్తూ యువతను మెస్మరైజ్ చేస్తుంది. మొన్నటిదాకా బోల్డ్ లుక్స్​తో అదరగొట్టిన ఈ బ్యూటీ ఈ మధ్య కాస్త ట్రెడిషనల్​ లుక్​లో కనిపిస్తోంది.

- Advertisement -

తాజాగా రాశీ ఖన్నా తన సోషల్ మీడియా ఖాతాలో ట్రెడిషనల్ లుక్​లో ఉన్న ఫొటోలు పోస్టు చేసింది. ఈ ఫొటోల్లో రాశీ.. పట్టుచీరలో కనిపిస్తోంది. పర్పుల్ కలర్​లో ఉన్న పట్టుచీరలో స్లీవ్​లెస్ బ్లౌజులో.. జుట్టు విరబోసుకుని.. అందమైన జుమ్కీలు చెవులకు పెట్టుకుని మెడలో బంగారు ఆభరణాలతో లక్ష్మీదేవిలా కళకళలాడిపోతోంది. ఇక ఈ ట్రెడిషనల్ లుక్​లో రాశీ మెస్మరైజింగ్ స్మైల్​తో యువత గుండె కొల్లగొట్టింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరోవైపు రాశీ ఖన్నా సినిమాల సంగతికి వస్తే ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్​లో బిజీగా గడుపుతోంది. అక్కడే సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి యోధ సినిమాలో నటిస్తోంది. మరోవైపు అజయ్ దేవగణ్​తో కలిసి రుద్ర్-2 వెబ్ సిరీస్​లోనూ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు ఓ తమిళ సినిమాలోనూ నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ.

( Photos : Instagram )

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...