పురిటి నొప్పులతోనే గ్రూపు-2 పరీక్ష రాసిన మహిళ..!

-

తెలంగాణలో రెండు రోజుల నుంచి గ్రూపు-2 పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే గ్రూపు-2 పరీక్షల్లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం బాణాల గ్రామానికి చెందిన రేవతి నాగర్ కర్నూల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రూపు-2 పరీక్ష రాసేందుకు వెళ్లారు. పరీక్ష రాసే సమయంలోనే ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. అయినప్పటికీ ఆమె పురిటి నొప్పులతో గ్రూప్-2 పరీక్ష రాసింది.

పరీక్ష కేంద్రం వద్ద వైద్య సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తీసుకెల్లేందుకు సిద్ధం అయ్యారు. అందుకు ఆమె అంగీకరించలేదు. పరీక్ష రాస్తానని చెప్పారు. ఆమె కాన్పు తేదీ ఇవాళే కావడంతో అందరూ కాస్త ఆందోళనకు గురయ్యారు. అయినప్పటికీ ఆమె పట్టు వదలకుండా పరీక్ష రాస్తానని చెప్పడంతో అధికారులు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ సంతోష్ దృష్టికీ తీసుకెల్లారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం.. పరీక్ష కేంద్రంలో 108 అత్యవసర వాహనాన్ని అందుబాటులో ఉంచారు. ప్రత్యేక వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఆమెకు ఎప్పుడు నొప్పులు వచ్చినా ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అన్నీ సిద్ధంగా ఉంచారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version