తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పబ్లిక్ పరీక్షల నిర్వహణంపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే విద్యార్థుల పరీక్ష ఫీజుల చెల్లింపుపై రెండు సార్లు గడువు పెంచిన అధికారులు.. వార్షిక పరీక్షల తేదీలను తాజాగా ఖరారు చేశారు. 2025 మార్చిలో ఇంటర్ పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు నిర్ణయానికి వచ్చారు. మార్చి చివరి నాటికి ఇంటర్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. మార్చి 05 నుంచి 25 వరకు పరీక్షలు జరుగనున్నాయి.
ఫిబ్రవరి 03 నుంచి 22 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగనున్నాయి. ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 05తో ప్రారంభం కాగా.. సెకండ్ ఇయర్ పరీక్షలు మార్చి 25 న ముగియనున్నాయి. అదేవిధంగా జనవరి 29న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జరుగనుంది.