సీఎం కేసీఆర్ కు సెంటిమెంట్ గా ఉన్న ఆలయంలో దొంగతనం చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని కొనాయిపల్లి, వెల్కటూరు గ్రామాల్లోని దేవాలయాల్లో హుండీలను దొంగలు ఎత్తుకెళ్లారు. సిద్దిపేట జిల్లాలో దొంగల హల్చల్ చేశారు. సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో చోరీకి పాల్పడ్డారు దొంగలు.
కొనాయిపల్లి, వెల్కటూర్ గ్రామాల్లో వెంకటేశ్వర స్వామి, భద్రకాళి, పోచమ్మ దేవాలయాలలో చోరీ చేశారు. కొనాయిపల్లి గ్రామంలో సీఎం కేసీఆర్ కి సెంటిమెంట్ గా ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా చోరీ చేశారు దొంగలు. హుండీలో ఉన్న 40 వేల నగదు, 8 తులాల వెండిని ఎత్తుకెళ్లారు దొంగలు. సిసి కెమెరాలో రికార్డ్ దొంగతనం విజువల్స్ అయ్యాయి. ఇక దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.