రామచంద్రాపురంలో రచ్చ..మంత్రి వర్సెస్ ఎంపీ..సీటు ఎవరికి?

-

ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ఏపీలో నేతలు..సీట్ల కోసం పోటీ పడుతున్నారు. ముఖ్యంగా వైసీపీ, టీడీపీల్లో సీట్ల కోసం పోటీ పడే నేతల సంఖ్య పెరిగింది. దీంతో ఆధిపత్య పోరు పెరుగుతుంది. ఈ క్రమంలోనే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గంలో రచ్చ మొదలైంది. మొన్నటివరకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు పోరు నడుస్తుంది.

ఇక్కడ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గాలకు పడటం లేదు. రామచంద్రాపురం సీటు కోసం బోస్ ప్రయత్నిస్తున్నారు. తన తనయుడుకు సీటు ఇప్పించుకోవాలని చూస్తున్నారు. కానీ అక్కడ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వేణు..సీటు వదులుకోరు.  వాస్తవానికి రామచంద్రాపురం బోస్ సొంత స్థానం..అక్కడ నుంచి మూడుసార్లు గెలిచారు. కాంగ్రెస్ లో మంత్రిగా చేస్తున్నప్పుడే..పదవికి రాజీనామా చేసి..ఎమ్మెల్యే పదవి వదులుకుని వైసీపీలో చేరి 2012 ఉపఎన్నికలో పోటీ చేసి ఓడిపోయారు. 2014లో కూడా ఓడిపోయారు.

2019లో తాను సైడ్ అయ్యి..వేణుకు ఛాన్స్ ఇచ్చారు. దీంతో వేణు..రామచంద్రాపురంలో గెలిచారు. అటు బోస్…మండపేటలో పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఓడిపోయాక జగన్..ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఇచ్చారు. కానీ మండలి రద్దు అంటూ ఆయన చేత రాజీనామా చేయించారు. వెంటనే రాజ్యసభ పదవి ఇచ్చారు. ఇక రామచంద్రాపురంలో టి‌డి‌పి నుంచి పోటీ చేసి ఓడిపోయిన తోట త్రిమూర్తులుని వైసీపీలోకి తీసుకుని…మండపేట బాధ్యతలు ఇచ్చి ఎమ్మెల్సీ చేశారు.

దీంతో బోస్‌కు ఏ సీటు ఖాళీ లేదు. కానీ మళ్ళీ తన సొంత సీటు రామచంద్రాపురంని దక్కించుకుని, తన తనయుడుకు ఇప్పించాలని చూస్తున్నారు. ఈ మేరకు కార్యక్రమాలు మొదలుపెట్టారు. దీంతో మంత్రి వేణుకు సెగలు మొదలయ్యాయి. అయితే చివరికి ఎవరికి సీటు దక్కిన..ఒకరు సహకరించరు. దీంతో అక్కడ వైసీపీకే డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి వైసీపీ అధిష్టానం దీనిపై ఫోకస్ పెట్టి..పోరుకు చెక్ పెట్టాలి.

Read more RELATED
Recommended to you

Latest news