హైదరాబాద్ ను షే క్ చేసిన దొంగలు

Join Our Community
follow manalokam on social media

హైదరాబాద్ లో దొంగలు చుక్కలు చూపించారు.  దొంగలు ఇప్పుడు నగరంలో నానా నాశనం చేసారు. ఎక్కడ దొంగతనం చేసిన కనీసం 5 ఇళ్లనే టార్గెట్ చేస్తున్న గ్యాంగ్… పోలీసులకు చుక్కలు చూపిస్తుంది. శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్ ఇంటికి కన్నం వేసారు. వారం రోజుల వ్యవధిలోనే 15 చోరీలకు పాల్పడ్డారు.సంక్రాంతి పండగను టార్గెట్ చేసుకుని రాష్ట్రంలో అంతర్రాష్ట్ర దొంగల గ్యాంగులు తిరుగుతున్నాయి.

పోలీసుల ముందస్తు హెచ్చరికలతో విలువైన బంగారు ఆభరణాలు డబ్బులను ఇళ్లల్లో జనాలు పెట్టుకోలేదు. సైబరాబాద్ పరిధిలో ఆటోలతో ప్రతి గల్లీలో పోలీసులు వార్నింగ్ లు ఇచ్చారు. తూగుంటలో ఒక్క రోజే ఐదు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు.  బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 5 ఇళ్ళలో చోరీ చేసారు. బాలనగర్ జోన్లో వారం రోజుల వ్యవధిలోనే 20 చోరీల పాల్పడ్డారు.

సీసీ కెమెరాలు లేని ప్రదేశాలని టార్గెట్ చేస్తున్న ఘరానా గ్యాంగ్స్… అవుటర్ రింగ్ రోడ్డు నగర శివారు ప్రాంతాలలో అధిక చోరీలు అవుతున్నట్లు గుర్తించారు. శివారు ప్రాంతాల్లో పెట్రోలింగ్ పోలీస్ వ్యవస్థను రెట్టింపు చేసినా సరే దొంగలు ఆగడం లేదు. హైదరాబాద్ నగర పరిధిలో ఇప్పుడు సీసి కెమెరాల సంఖ్యను కూడా పోలీసులు భారీగా పెంచుతున్నారు.

TOP STORIES

శనిత్రయోదశి రోజు ఏం చేయాలి?

శనిదేవుడు అంటేనే మనకు భయం. ఎందుకంటే శనిదేవుడు మన జన్మరాశిలోకి ప్రవేశిస్తే ఏడు ఏళ్లు మనకు కష్టాలు కలుగుతాయనే నమ్మకం. నిజానికి శనిదేవుడు మంచివాడు. శని...