ఏపీలో కాకుండా…తమిళనాడులో ప్రచారం చేయనున్నారు నారా లోకేష్. ఈ మేరకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోయంబత్తూరు పర్యటన వివరాలు రిలీజ్ చేశారు. కోయంబత్తూరు ఎంపీ అభ్యర్థి, బీజేపి తమిళనాడు రాష్ర్ట అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు నారా లోకేష్.

తెలుగువారు ఎక్కువగా స్థిరపడిన ప్రాంతాల్లో నారా లోకేష్ ప్రచారం చేస్తారు. ఇందులో భాగంగానే….11.4.24 గురువారం రాత్రి 7 గంటలకు పీలమేడు ప్రాంతంలో తమిళనాడు బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు నారా లోకేష్. 12.4.24 శుక్రవారం ఉదయం 8 గంటలకు సింగనల్లూర్ ఇందిరా గార్డెన్స్ లో తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశం అయ్యి అన్నామలై విజయానికి సహకరించాలని కోరనున్నారు లోకేష్.