‘గృహలక్ష్మి’కి లైన్‌ క్లియర్.. మార్గదర్శకాలు ఇవే

-

పేదల గృహ నిర్మాణ పథకం ‘గృహలక్ష్మి’ కి లైన్ క్లియర్ అయింది. పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను బుధవారం ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఇక దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్నది. సొంత జాగా ఉన్న పేదలకు మూడు దశల్లో రూ. 3 లక్షలు మంజూరు చేస్తారు. గృహలక్ష్మీ పథకం విధివిధానాలను ప్రభుత్వం విడుదల చేసింది.

గృహలక్ష్మీ పథకం విధివిధానాలు ఇవే

* సొంత స్థలం ఉన్న పేదల ఇంటి నిర్మాణానికి 100% రాయితీతో మూడు దశల్లో రూ. లక్ష చొప్పున రూ.3 లక్షల సాయం.

* కలెక్టర్ ఆధ్వర్యంలో నియోజకవర్గానికి 3 వేల చొప్పున లబ్ధిదారుల ఎంపిక.

* మహిళల పేరు మీద ఈ సాయం అందిస్తారు.

* తప్పనిసరిగా ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉండాలి.

* సొంత డిజైన్ తో ఇల్లు కట్టుకునేందుకు అనుమతి.

Read more RELATED
Recommended to you

Latest news